వైద్యం వ్యాపారం కారాదు... జిల్లా అడ్మిన్ ఎస్పి. ఎన్ వెంకటేశ్వర్లు
వైద్యం వ్యాపారం కారాదు...!!
--- సామాన్యులను దృష్టిలో ఉంచుకొని మెడికల్ షాపులు నిర్వహించాలి.
-- జిల్లా అడ్మిన్ ఎస్పి. ఎన్ వెంకటేశ్వర్లు.
సామాజికంగా ఆలోచన చేసినప్పుడు వైద్యాన్ని వ్యాపారంగా చూడరాదు అని జిల్లా అడ్మిన్ ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు అన్నారు. రెండు రోజుల క్రితం ఆయన కుమారుడు వైద్యం నిమిత్తం మందుల కోసం మెడికల్ షాపు కు వెళితే మొత్తం స్ట్రిప్ తీసుకోవాలని అందులో తగ్గించి ఒకటి రెండు టాబ్లెట్ లు ఇవ్వలేమని మెడికల్ షాపు యజమాని అనడం విచిత్రంగా ఉందన్నారు. సామాజిక కోణం లో చూసినప్పుడు మెడికల్ షాప్ యజమానులు పేదలను దృష్టిలో ఉంచుకొని తమ వ్యాపారాలు కొనసాగించాలని ఆయన అన్నారు. అనారోగ్యానికి గురై చాలా మంది పేదలు కూలీలకు సరిపడా డబ్బులు లేక పరిమితంగా కొనుగోలు చేస్తారని ఆయన ఈ సందర్భంగా మీడియా దృష్టికి తెచ్చారు. డబ్బులు లేని నిరుపేదలు కొన్ని టాబ్లెట్స్ మాత్రమే ఇవ్వాలని అడిగితే తప్పకుండా వారికి అందజేసి ప్రాణాలు కాపాడాలని ఆయన అభిప్రాయపడ్డారు. మెడికల్ షాపుల నిర్వహణ అనేది కేవలం సామాజిక కోణంలో చూడాలి తప్ప వ్యాపారం కోణంలో చూడరాదని ఆయన అన్నారు. ముఖ్యంగా అనేక వ్యాపారాలు డబ్బుల కోసమే జరుగుతున్నాయని మెడికల్ షాపుల నిర్వహణ మాత్రం అందుకు భిన్నంగా ఉంటుందని గుర్తుచేశారు. ఎవరైనా పేదలు వచ్చి తగు మోతాదులో మందులు ఇవ్వాలని కోరితే నిరాకరించిన మందుల షాపు యాజమాన్యాల విషయంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ నంబర్ కు ( 8333925832)
ఫిర్యాదు చేయవచ్చని ఆయన అన్నారు. అప్పటికి సంబంధించిన అధికారులు స్పందించకపోతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సైతం చేయవచ్చునని ఆయన గుర్తు చేశారు. ఒక జిల్లా పోలీసు అధికారి కె ఇలాంటి సంఘటనలు ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. ఇదే విషయమై పోలీస్ ఆఫీసర్ సంబంధిత మెడికల్ షాప్ పై ఔషధ తనిఖీ అధికారి కి ఇచ్చిన ఫిర్యాదు చేయగా ఈ మేరకు రిటైల్ గా మందులు పేదలకు అందజేయాలి అని చెప్పి ఔషధ తనిఖీ అధికారి ఒక సర్క్యులర్లు జారీ చేశారనీ ఆయన తెలిపారు. మెడికల్ షాపు యజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు . మెడికల్ నిబంధనల మేరకు ఫార్మసీ యాక్ట్ ప్రకారం నడుచుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేదలకు ఇబ్బందికరంగా ఉండదు అని ఆయన గుర్తుచేశారు. సేవా భావం కొరవడి వ్యాపార దృక్పథం పెరగడం వల్లనే పేదలు వైద్యానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్య ,వైద్యం తో పాటు పలు రంగాలను కేవలం సామాజిక కోణంలో చూడాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు చైతన్యవంతంగా ఉండాలన్నారు. ఇదే విషయమై మరో సామాజిక కార్యకర్త, ద రిజిస్టర్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు వాకిట అశోక్ కుమార్ రాసిన కథనాలపై వివిధ సందర్భాలలో అధికారులు సైతం స్పందించార నీ , విలేకరులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి విషయాలపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఫార్మసిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వాకిట అశోక్ కుమార్ స్పందిస్తూ ఇకముందు ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై వరుస కథనాలు అందించి సామాజికంగా పోలీసులకు సహకరిస్తామని ఆయన అన్నారు .ప్రజలు మందులు కొనుగోలు చేసినప్పుడు బిల్లులు తప్పనిసరి తీసుకోవాలి అని ఆయన అన్నారు. తప్పులు చేస్తున్న మందుల షాపు ల పై , బిల్లులు ఇవ్వని మందుల షాపు ల పై ఔషధా తనిఖీ అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని ఆయన అన్నారు. అప్పటికి అధికారులు కేసు నమోదు చేయకపోతే సంబంధిత పోలీస్ స్టేషన్లో నేరుగా ఫిర్యాదు సైతం చేయవచ్చునని ఆయన గుర్తు చేశారు.