ఓపెన్ ప్లాట్ లకు నిర్వహించిన బహిరంగ వేళానికి మంచి స్పందన
సారిక టౌన్షిప్, పోతులమడుగు టౌన్ షిప్ లలోని ఓపెన్ ప్లాట్లకు నిర్వహించిన బహిరంగ వేలానికి ప్రజల నుండి మంచి స్పందన లభించిందని రెవెన్యూ అదనపు కలెక్టర్ కె .సీతారామారావు అన్నారు .
శుక్రవారం ఆయన బాదం రామస్వామి ఆడిటోరియంలో పై టౌన్ షిప్ లలోని ఖాళీ ప్లాట్లకు నిర్వహించిన బహిరంగ వేలం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.16వ తేదీ నిర్వహించిన వేలానికి తక్కువ మంది బిడ్డర్లు హాజరైనప్పటికీ, 17వ తేదీ అనూహ్యంగా ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారని ,అంతేకాక పోటా పోటీగా వేలం పాటలో పాల్గొన్నట్లు ఆయన వెల్లడించారు. కాగా శుక్రవారం సారిక టౌన షిప్, పోతులమడుగు టౌన్ షిప్ లలోని ప్లాట్ల కోసం నిర్వహించిన బహిరంగ వేలంలో మొత్తం 40 ఫ్లాట్లు అమ్ముడుపోగా, 6 కోట్ల 69 లక్షల రూపాయల రాబడి ప్రభుత్వానికి వచ్చినట్లు అడిషనల్ కలెక్టర్ వెల్లడించారు.
శనివారం కూడా బహిరంగ వేలం కొనసాగుతుందని ,మధ్యాహ్నం నుండి సారిక, పోతులమడుగు టౌన షిప్ లలో మిగిలిపోయిన ప్లాట్ లకు బహిరంగవేలాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు 10 వేల రూపాయల ధరావత్తు చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగ వేలంలో ప్లాట్లు దక్కించుకున్న బిడ్డర్లకు ఫ్లాట్ కేటాయింపు ఉత్తర్వులను అందజేశారు.గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వైద్యం భాస్కర్, ఎస్బిఐ నుండి విశ్వనాథం తదితరులు హాజరయ్యారు.