ఘనంగా పవన్ పుట్టినరోజు వేడుకలు
ఘనంగా పవన్ పుట్టినరోజు వేడుకలు..
-రక్తదానం చేసిన అభిమానులు
-శిబిరాన్ని ప్రారంభించిన వి.వి. చారి , చైర్మన్ నటరాజ్
ప్రముఖ సినీ నటుడు మరియు జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 50వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పాలమూరులో అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పి.ఆర్ రాఘవేంద్ర ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు మెగా ఫ్యామిలీ అభిమానులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. రక్తదాన శిబిరాన్ని వి. వి . చారి రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ లు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో దాదాపు 50 మంది అభిమానులు యువకులు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో మెగాఫ్యామిలీ అభిమాన సంఘం పిఆర్ రాఘవేందర్, నరసింహ బాలాజీ శేఖర్ కళ్యాణ్ వెంకటేష్ ఎస్ కే శీను డాక్టర్ వి శ్రీనివాసులు బి.గోపాల్ నాగేష్ అదేవిధంగా మెగా ఫ్యామిలీ లో భాగంగా అల్లు అర్జున్ ఆర్మీ నుండి వెంకటేష్ రెడ్డి కళ్యాణ్ రాజు సాయి తదితరులు పాల్గొన్నారు