అంతర్ రాష్ట్ర ముఠాను పట్టుకున్న గద్వాల్ పోలీసులు
గద్వాల్: విభూతి, భస్మం, మంత్రాల పేరుతో మాయా మాటలు చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తూ వారి నుండి డబ్బులను దొంగాలిస్తున్న 8 మంది గ్రూప్ గా ఉన్న అంతర్ రాష్ట్ర ముఠాను జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకొని వారి నుండి కార్లు , సెల్ ఫోన్స్ మరియు నగదు ను స్వాధీనం చేసుకొని ఈ రోజు మీడియా సమావేశం అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్ గారు మీడియా సమావేశం లో తెలిపారు.
2 సంవత్సరాల క్రితం మహారాష్ట్రకు చెందిన తాశావర్ ఖాన్ S/o గులాం గౌస్ ఖాన్, వయసు: 34,అనే బాబా అయిజకు వచ్చినప్పుడు పిర్యాది సూర్య వెంకన్న గౌడ్ s/o చిన్న మల్లయ్య r/o తుపత్రాల గ్రామం అయిజ మండలoను పరిచయం చేసుకొని అతడు తన దగ్గర అద్భుతమైన శక్తులు ఉన్నాయి మంత్రంచిన భస్మoను ఇంట్లో చల్లుకునట్లైతే కష్టాలు పోయి డబ్బులు ఆకాశంలో నుండి కిందకు పడతాయి ధనవంతులు అవుతారు అని చెప్పి పిర్యాదిని పరిచయం చేసుకొని ఫోన్ నెంబర్ తీసుకున్నాడు, కొన్ని నెలల క్రితం తాశావర్ ఖాన్ తుపత్రాలకు చెందిన పిర్యాది సూర్య వెంకన్న గౌడ్ కు ఫోన్ చేసి మీ గ్రామంలో మీ ఇంటికి వచ్చి పూజలు చేసి మంత్రిoచిన భస్మo ఇస్తాను, భస్మoను కలిగిన డబ్బా ఒకటి 12 లక్షల 50 వేల రూపాయలు అని చెప్పి అట్టి బస్మం ను మీ ఇంట్లో చల్లుకునట్లైతే పెద్ద ధనవంతుడవు అవుతావు అని చెప్పినాడు, పిర్యాది సూర్య వెంకన్న గౌడ్ నమ్మి సరే అని చెప్పినాడు, తేదీ 30.08.2021 మధ్యాహ్నం 2 గంటల సమయంలో పిర్యాది సూర్య వెంకన్నగౌడ్ తుపత్రాల గ్రామం అయిజ మండలoలో ఉండగా తాశావర్ ఖాన్ స్నేహితులు అయినటువంటి సయ్యద్ ఇక్బాల్, అజయ్, భీమ్ రావు, కర్ణాటకకు చెందిన నవాజ్ షేక్, అలీముద్దిన్, హైదరాబాదుకు చెందిన షేక్ బషీర్, అన్వర్ ఖాన్ మొత్తం ఎనిమిది మంది ఇన్నోవా మరియు ఇటియాస్ కార్లలో మా ఇంటికి నాగుపామును తీసుకొని వచ్చి మా ఇంట్లో మంత్రాలూ చేసి పై నుండి డబ్బులు పడుతున్నట్లు చేసి పిర్యాది ని నమ్మించారు, అట్టి బస్మం డబ్బా ఒకటి 10 లక్షల రూపాయలు అని చేపినారు అతని దగ్గర అన్ని డబ్బులు లేవు అని చేప్పగా అడ్వాన్సు గా 30,000 రూపాయలు తీసుకోని తీసుకొని అక్కడ నుండి హైదరాబాద్ వెళ్లి ఉన్నారు ఈరోజు తేది 03.09.2021 ఉదయం కర్ణాటక రాష్ట్రం రాయచూర్ లో పార్టీ ని కలిసి పూజలు చేసి వారిని నమ్మించి డబ్బులు తీసుకొని మోసం చేయాలని ఐజ మీదుగా రాయచూరు కి వెళుతుండగా అయిజ చౌరస్తాలో ఉదయం అందాజ 08: 00 గంటల సమయంలో పోలీసు వారు వాహన తనిఖీ చేస్తూ వారి కార్లను ఆపగా వారు పారిపోయేందుకు ప్రయత్నించగా అయిజ పోలీసులు పట్టుకోవడం జరిగింది . వారి వద్ద నుండి 2 కారులు, నాగు పాము (ఫారెస్ట్ Dept వారికి అప్పగించానైనది), 25000/- నగదు, సెల్ ఫోన్ లు స్వాదినం చేసుకోనైనది.
గత కేసుల వివరములు :
నిందితుడు A1 తసవర్ ఖాన్ R/o మహారాస్ట్ర 2019 సం. లో అక్టోబర్ నెల లో అయిజ మండలం ఉప్పల గ్రామ మ కు చెందిన ప్రహల్లాద్ రెడ్డి ని ఇదే తరహలో మోసం చేసి అతని వద్ద నుండి 62.50 లక్షలు తీసుకొన్నారు ఇతనిని అ కేసు లో PT వారెంట్ పై హాజరు పరిచి, తరువాత పోలీస్ కస్టడీ కి తీసుకొని దర్యాప్తు చేయవలసి ఉన్నది. ( cr.no: 235/19 u/s 417,420r/w 34 IPC )
స్వాదిన పరచుకున్న వస్తువులు :
1. TAYOTA innova car bearing No: MH 14 FS 7553
2. TAYOTA ITIOS car bearing No:KA-33-A-5442
3. నాగుపాము ( ఫారెస్ట్ Dept వారికి అప్పగించానైనది )
4. 25,000/- నగదు
5. రాగి రింగులు -02
6. సెల్ ఫోన్స్ -9
నిందితుల వివరములు :
A1:- మహమ్మద్ తాశావర్ ఖాన్ S/o గులాం గౌస్ ఖాన్ @ ఖాద్రి గౌసే ఖాన్ వయసు: 34 సంవత్సరాలు,కులం: ముస్లిo, వృత్తి:వ్యాపారం R/o అమర్ దాస్ నగర్, రిసోడ్ గ్రామము మరియు తాలూకా వాసిమ్ జిల్లా, మహారాష్ట్ర.
A2:-సైయద ఇక్బాల్ S/o సైయద్ హుస్సైని వయసు: 40 సంవత్సరాలు,కులం: ముస్లిo, వృత్తి:వ్ కూలీ R/o వాకత్ గ్రామము మరియు రిసోడ్ తాలూకా వాసిమ్ జిల్లా, మహారాష్ట్ర.,
A3:.అజయ్ S/o అరవింద్ మోర్ వయసు: 40 సంవత్సరాలు,కులం: బుద్ధ, వృత్తి: డ్రైవర్ R/o అమర్ దాస్ నగర్, రిసోడ్ గ్రామము మరియు తాలూకా వాసిమ్ జిల్లా, మహారాష్ట్ర.,
A4:-. భిమ్ రావు @ భీమ S/0 శేష రావు సిర్సాత్ వయసు: సంవత్సరాలు,కులం: బుద్ధ, వృత్తి: కూలీ R/o అమర్ దాస్ నగర్, రిసోడ్ గ్రామము మరియు తాలూకా వాసిమ్ జిల్లా మహారాష్ట్ర.
A5:-అలీమ్వుద్దిన్ S/o షైక్ అహమ్మద్ వయసు: సంవత్సరాలు,కులం: ముస్లిo, వృత్తి: ప్రైవేటు ఎంప్లాయ్ R/o మరికల్ గ్రామము మరియు భిధర్ తాలూకా & జిల్లా, మహారాష్ట్ర,
A6:-నవాజ్ శిక్ S/o MD రఫికుద్దినె వయసు: 30 సంవత్సరాలు,కులం: బుద్ధ, వృత్తి: కంప్యూటర్ సెంటర్ R/o సంగమేశ్వర్ కాలనీ మరియు భిధర్ తాలూకా & జిల్లా మహారాష్ట్ర.
A7:-అన్వర్ ఖాన్ S/o లేట్ సర్దార్ ఖాన్ వయసు: 43 సంవత్సరాలు,కులం: ముస్లిం, వృత్తి: పెయింటర్ R/o NSF కాలనీ హకీంపేట గోల్కొండ హైదరాబద్.
A8:-శైక్ బషీర్ S/o శిక్ సదాత వయసు: 39 సంవత్సరాలు,కులం: ముస్లిం, వృత్తి: కూలీ R/o మొగల కాలనీ ఆబుబాకర్ మజీద్, మైదేవేర్పల్లీ హైదరాబద్.
కేసును ఛేదించిన విధానము:
సాంకేతిక మరియు మానవ నైపుణ్యం ఆదారంగా జిల్లా ఎస్పీ శ్రీ J. రంజన్ రతన్ కుమార్ గారు, మరియు గద్వాల్ డి. ఎస్పీ శ్రీ NC రంగస్వామీ గార్ల సూచనలను పాటిస్తూ శ్రీ. J వెంకటేశ్వరులు సర్కిల్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ శాంతినగర్ ఆద్వర్యంలో G. ముతయ్య సబ్-ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ (ప్రస్తుతం) అయిజ PS, అప్పటి ఎస్సై జగదీష్ , సిబ్బంది PC రంజిత్ కుమార్ CCS గద్వాల్, శివ శంకర్, నగేష్, అయిజ PS, యాకుబ్ హుస్సేన్ , వెంకప్ప PC- శాంతినగర్ సర్కిల్ ఆఫీస్, అయిజ పోలసు సిబ్బంది రాజమహమ్మద్, రాజశేకర్, శ్రీనివాసులు, అoజనేయులు, HGs శాలిబాష్, వాజిద్ స్వాములు చాకచక్యంగా వారిని పట్టుకొని కేసును ఛేదించి అట్టి నేరస్తుని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి దోచుకున్న సొత్తును స్వాదీనం చేసువడం జరిగింది.