GCP అండ్ క్లినికల్ ట్రయిల్స్ పై మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో
GCP అండ్ క్లినికల్ ట్రయిల్స్ పై ఏర్పాటు చేసిన ఒక్క రోజు ట్రైనింగ్ ప్రోగ్రాంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
గురువారం మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమమును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మంచి ప్రతిభను కనబరచి PG సీట్లు ను ఈ సంవత్సరం నుంచి ప్రారంభించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహాబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ ను నెంబర్ వన్ కాలేజ్ గా తీర్చిదిద్దేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని, కొత్తగా చేరిన పిజీ వైద్య విద్యార్థులు పరిశోధన క్షుణ్ణంగా అధ్యయనం చేసే విధానం, కొత్త రకం పరీక్షలు నిర్వహించటలో పాటించాల్సిన నిబంధనలు, జాగ్రత్తలకై శిక్షణ ఇస్తారని, హైదరాబాద్ కు వెళ్లకుండా మహబూబ్ నగర్ లోనే అన్ని రకాల వ్యాధులు చికిత్స అందించే విధంగా అన్ని రకాలుగా సదుపాయాలు చేసుకున్నామని, రోజు 125 నుండి 150 నమూనా పరీక్షలు నిర్వహించవచ్చని, వైద్యులు దేవుని ప్రతిరూపాలు అని, ప్రజలకు భరోసా కలిగించే విధంగా మీరంతా పని చేయాలని, మెడికల్ కళాశాలను మొదటి స్థానంలో నిలిపే విధంగా మీరంతా పని చేయాలని మంత్రి అన్నారు.
ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్ రావు. మున్సిపల్ ఛైర్మన్ కె.సి నర్సిములు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ రామ్ కిషన్, మెడికల్ డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్, ప్రోఫెసర్లు, కళాశాల సూపరింటెండెంట్, తదితరులు పాల్గొన్నారు