శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాలు
శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాలు...
మహిళా సాధికారతలో ముందుంటాం....
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి....
- మంత్రి పుట్టినరోజు సందర్భంగా నైపుణ్య శిక్షణ శిబిరం ప్రారంభోత్సవంలో శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీహిత
శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, భవిష్యత్తులోనూ మరింత విస్తృతంగా తమ కార్యక్రమాలు కొనసాగుతాయని ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీహిత తెలిపారు. మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా సెయింట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక రాయల్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మహిళల నైపుణ్య శిక్షణ శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మంత్రి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా పెద్ద ఎత్తున హాజరైన మహిళలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు... మహిళా సాధికారత కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. తమ తండ్రి మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్ పుట్టిన రోజు సందర్భంగా సెయింట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు ఉద్యోగాలను కల్పించే విధంగా 100 రోజుల నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని తెలిపారు. వందరోజుల నైపుణ్య శిక్షణ అనంతరం వారి విద్యార్హతను బట్టి చక్కని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు సెయింట్ ఫౌండేషన్ చైర్మన్ అయిన పద్మశ్రీ బి.వి.ఆర్ మోహన్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో చేపట్టే ఏ కార్యక్రమానికైనా తమ ట్రస్ట్ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ వందరోజుల నైపుణ్య శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడి కుటుంబానికి అండగా నిలబడేలా స్వయం సమృద్ధి సాధించాలన్నారు.
ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తున్నది...
- సెయింట్ ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ బివిఆర్ మోహన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అద్భుతంగా పనిచేస్తుందని సెయింట్ ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ బి.వి.ఆర్ మోహన్ రెడ్డి తెలిపారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎంతో ఆదర్శవంతంగా ఉన్నాయన్నారు. మహబూబ్ నగర్ జిల్లాను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఊహించని విధంగా అభివృద్ధి చేస్తున్నారని ఆయన కొనియాడారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సహకారంగా కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద తాము కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని మోహన్ రెడ్డి తెలిపారు.కార్యక్రమంలో సెయింట్ ఫౌండేషన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇన్చార్జి ప్రతిన్య, ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె పద్మావతి, ప్రభుత్వ బాలికల ఐటిఐ ప్రిన్సిపల్ వేమారెడ్డి, టీఎంఐ ప్రాజెక్ట్స్ టీం లీడ్ హేమలత రామకృష్ణన్, సెయింట్ ఫౌండేషన్ సిఎస్ఆర్ హెడ్ కృష్ణ దీవి తదితరులు పాల్గొన్నారు