మహబూబ్ నగర్ టౌన్ నందు పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్

 ట్రాఫిక్ సిబ్బంది మహబూబ్ నగర్ టౌన్ నందు పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా 11 మంది  ద్విచక్ర వాహన చోదకులు పట్టుబడ్డారు, వీరిని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కోర్టు నందు హాజరుపరచగా శ్రీమతి డి నిర్మల జడ్జి  9 మందికి నగదు జరిమానా, ఒకరికి 2,500/- రూపాయలతోపాటు మూడు రోజుల జైలు శిక్ష మరియు మరొకరికి 2000 రూపాయల నగదు జరిమానా రెండు రోజుల జైలు శిక్ష విధించడం జరిగినది.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అశోక్ మాట్లాడుతూ జిల్లా ప్రజలు  మద్యం తాగి వాహనం నడిపి తమ జీవితాలను మరియు ఎదుటివారి జీవితాలను ప్రమాదంలో పడేయకూడదని తెలిపారు