మహిళా దినోత్సవ సందర్భంగా జిల్లా TVVU మహిళా సదస్సు

 అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని తేదీ 09/03/2023  న తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ ఆధ్వర్యంలో  స్థానిక క్రిస్టియన్ కాలనీ   TVVU కార్యాలయం నందు  జిల్లాస్థాయి  మహిళా సదస్సు నిర్వహించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో గండీడు  , మహమ్మదాబాద్  , హన్వాడ  , నవాబుపేట  , కోయిలకొండ  మహబూబ్ నగర్ మండలాల నుండి యూనియన్ మహిళలు పురుషులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు..గ్రామ స్థాయి మహిళా యూనియన్ల  ప్రతిష్టత. 

2.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 నుండి 29 వరకు  గ్రామాల్లో మహిళా చైతన్య కార్యక్రమాల ద్వారా   " మహిళలపై జరుగుతున్న అన్ని రకాల హింసలను  అరికట్టడం మనకు సాధ్యమే We can end all violence against women  " ప్రచార ఉద్యమం చేయడం జరుగుతుంది
3. భూమిలేని వ్యవసాయ కూలీల స్థితిగతుల గూర్చి మాట్లాడి వారి సమస్యలను సేకరిస్తారు. 
4.  *అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళల సామాజిక భద్రత   గూర్చి ప్రధాన ఐదు డిమాండ్లను  ప్రభుత్వానికి  అందజేయడానికి  ఈ కార్యక్రమంలో  సంతకాలు సేకరిస్తారు.
5. మార్చి 29న  రాష్ట్రస్థాయి సదస్సు మహబూబ్ నగర్  జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది.* అని నిర్ణయం జరిగినది.ఈ కార్యక్రమంలో  రాష్ట్ర మహిళా కార్యదర్శి దయ్యాల వెంకటేశ్వరమ్మ  మరియు జిల్లా మహిళా కార్యదర్శి దన్నారం స్వాతి గారు పాల్గొన్నారు .