మహిళా ప్రజాప్రతినిధులను అభినందించిన... జిల్లా కలెక్టర్ వెంకట్రావు

 విత్తన బంతుల హరిత యాత్రలో భాగంగా గురువారం నిర్వహించిన  మహిళా హరిత యాత్ర లో  జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున  మహిళలు పాల్గొని 48 లక్షల 86 వేల  967 విత్తన బంతులను వెదజల్లినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు తెలిపారు.

  జిల్లాలో ఇప్పటివరకు  మొత్తం కోటి 3 లక్షల 71, 539  విత్తన బంతులు వేదజల్లినట్లు అయన తెలిపారు. ఇంకా 1,04,52,467 విత్తన బంతులు చల్లాల్సి ఉందని కలెక్టర్ వెల్లడించారు.తన పిలుపు మేరకు గురువారం మహిళలు , మహిళా ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున విత్తన బంతుల కార్యక్రమంలో పాల్గొని  విత్తనాలు చల్లి విజయవంతం చేసినందుకు ఆయన వారిని అభినందించారు .తక్కిన 3 రోజులు కూడా విద్యార్థి,యువజన హరిత యాత్ర,ఉద్యోగ హరిత యాత్ర,నరేగా హరిత యాత్రలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.