రెడ్ క్రాస్ అనాథాశ్రమానికి రూ.10 వేల వితరణ

 విద్యార్థి ఉదారత...

రెడ్ క్రాస్ అనాథాశ్రమానికి రూ.10 వేల వితరణ
ఏనుగొండ లోని  రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  అనాథాశ్రమానికి ఒక విద్యార్థి రూ 10వేల రూపాయల ను వితరణ గా అందజేశారు. నారాయణ పేట జిల్లా ధన్ వాడ మండలం రామకిష్టాయి పల్లి గ్రామానికి చెందిన యం.మల్లేష్ తన జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం అనాథాశ్రమాన్నీ సందర్శించి అనాథ విద్యార్థుల సంక్షేమం నిమిత్తం రూ.10వేల రూపాయలు అందజేశారు.స్థానిక oగా  డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మల్లేష్   అనాథాశ్రమానికి ఆర్థిక సాయం అభినందనీయమని రెడ్ క్రాస్ ప్రతి నిధులు పేర్కొన్నారు. కాగా   రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజు, కోశాధికారి జగపతిరావు , రాష్ట్ర సభ్యులు బెక్కం జనార్దన్, జిల్లా సభ్యులు రమణయ్య, జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త అశ్విని చంద్రశేఖర్ లు విద్యార్థి మల్లేష్ ను ప్రత్యేకంగా   అభినందించారు.మహేష్ ను స్ఫూర్తిగా తీసుకుని దాతలు ముందుకు రావాలని కోరారు.