TVVU ఆధ్వర్యంలో కరోనా మెడికల్ కిట్స్ పంపిణీ
TVVU ఆధ్వర్యంలో కరోనా మెడికల్ కిట్స్ - పంపిణీ
తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ -TVVU ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో స్థానిక క్రిస్టియన్ కాలనీ TVVU కార్యాలయం నందు మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల్లో నవాబుపేట,హన్వాడ,గండీడ్ మహమ్మదాబాద్ చౌదర్ గూడెం, కొందుర్గు మండలల్లో 90 గ్రామాలకు గ్రామస్థాయి యూనియన్ కు ఒక్క కిట్ చొప్పున 90 కిట్లు ఆయా మండలాల యూనియన్ కార్యదర్శులకు అందజేయడం జరిగినది. ఒక కిట్టు లో తొమ్మిది రకాలు ( 1.Dettol -3 బాటిల్స్ ,2. శానిటైజర్స్ - 5 బాటిల్స్ ,3.బ్లీచింగ్ పౌడర్ -5 ప్యాకెట్స్,4.మాస్క్ లు - 50 ,
5. డిజిటల్ ర్మామీటర్స్ -2, 6.పల్స్ మీటర్ 1,
7.గ్లౌజ్ - 2 సెట్లు ,8.పారాసెటామోల్ - 125 టాబ్లెట్స్ ,
9.కఫ్ సిరప్ - 3 బాటిల్స్ ) పొందుపరిచి 90 గ్రామాల కోరకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్ట గళ్ళ వెంకటయ్య రాష్ట్ర కార్యదర్శులు బి నాగన్న , డి వెంకటేశ్వరమ్మ మండల కార్యదర్శులు బి రాజు , మ్యాతరి వెంకటయ్య , పీ భువనేశ్వరి , తిమ్మగళ్ల మునేష్ , ప్రకాష్ నాగమ్మ , విజయలక్ష్మి మొదలగు పాల్గొన్నారు.