అద్దెబస్సు డ్రైవర్ల వేతనం పెంచాలని ధర్నా
అద్దెబస్సు డ్రైవర్ల వేతనం పెంచాలని ధర్నా
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో అద్దెబస్సు డ్రైవర్ల వేతనాలు రూ.26 వేలు చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర నాయకుడు కిల్లె గోపాల్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో బస్టాండు నుంచి తెలంగాణ కూడలి వరకు ప్రదర్శనగా వెళ్లి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బస్సు, ఆర్టీసీ యాజమాన్యాలతో అద్దె బస్సు డ్రైవర్లకు కుదిరిన ఒప్పందం మేరకు నెలకు రూ.26 వేలు వేతనం ఇవ్వాల్సి ఉండగా.. కేవలం రూ.10వేల లోపు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారని ఆరోపించారు. పైగా ఓవర్‌టైం డ్యూటీలు చేయించుకుంటున్నారని అన్నారు. అనంతరం మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, ఆర్‌ఎం కార్యాలయం, కలెక్టరేట్‌లో వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో నాయకులు ఖమర్ అలి, కురుమూర్తి, డ్రైవర్లు ఇస్మాయిల్, రామకృష్ణ, గోపాల్, కొండయ్య, జాకీర్, గాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.