మహబుబ్ నగర్ పట్టణ అభివృద్ది పై ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ రూపకల్పన,
రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ. వి. శ్రీనివాస్ గౌడ్ మహబుబ్ నగర్ పట్టణ అభివృద్ది పై ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ రూపకల్పన, అధునిక అండర్ గ్రౌండ్ వ్యవస్థ రూపకల్పన లపై హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు మహబుబ్ నగర్ పట్టణానికి మహర్థశ తీసుకరావాలనే లక్ష్యంతో అనాదిగా అస్థవ్యస్థంగా ఉన్న మురుగు నీటి వ్యవస్థ, వరద కాలువల వ్వవస్థ ల అభివృద్ది పై మంత్రి శ్రీ. వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులతో చర్చించారు. మురుగు నీటి వ్వవస్థ ను అధునికరించే కార్యక్రమములో భాగంగా పట్టణంలో అధునిక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్వవస్థ ఏర్పాటు పై ప్రదానంగా చర్చించారు. అందులో భాగంగా మహబుబ్ నగర్ పట్టణంలో సుమారు. 500 కోట్ల రూపాయల వ్వయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్వవస్థ ను రూపోందించటానికి ప్రతిపాదనలు సిద్దం చేయాటానికి కన్సల్ టెంట్ ల నియామాకం కోసం టెండర్ ను పిలువాలని మంత్రి అధికారులను అదేశించారు . అందులో భాగంగా మహబుబ్ నగర్ పట్టణంలో 98 Sq. కిలోమీటర్ల పోడవుతో నిర్మించనున్న అధునిక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్వవస్థ ను అభివృద్ది చేయటానికి ప్రణాళికలను రూపోందించాలని మంత్రి అధికారులను అధేశించారు . అందులో భాగంగా 5 STP ల ద్వారా మురుగు నీటిని శుద్ది యంత్రాలను ఏర్పాటు చేయాలన్నారు. మహబుబ్ నగర్ పట్టణంలోని పెద్ద చెరువు ను శుద్దిచేసేందుకు మురుగు నీటిని దారిమల్లించేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్దం చేయాలని మంత్రి అధికారులను అధేశించారు.
మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ది పై ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ తయారిపై పై సమీక్ష
ఈ సమీక్ష సమావేశంలో మహబుబ్ నగర్ పట్టణ అభివృద్ది పై రూపోందిస్తున్న ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ పై మంత్రి శ్రీ. వి. శ్రీనివాస్ గౌడ్ చర్చించారు. మహబుబ్ నగర్ పట్టణం వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో అందుకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పన లో భాగంగా పట్టణానికి అనుబందంగా వస్తున్న ప్రతిపాదిత రెండు జాతీయ రహదారులను అనుసందానిస్తూ మహబుబ్ నగర్ పట్టణానికి ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు పై ఈ సమీక్షలో చర్చించారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పన లో భాగంగా అన్ని ప్రభుత్వ శాఖలతో నిర్వహించే స్టేక్ హోల్డర్స్ మీటింగ్ లో చర్చించే అంశాలపై మంత్రి అధికారులకు దిశానిర్ధేశనం చేసారు. అంతేకాకుండా ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ రూపకల్పన పై క్షేత్రస్థాయి పర్యటన చేసి తదుపరి నిర్ణయాలను మాస్టర్ ప్లాన్ రూపకల్పన లో నమోదు చేయాలని మంత్రి అధికారులను అదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో DTCP డైరెక్టర్ విద్యాధర్ రావు, రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ సత్యనారాయణ, మహబుబ్ నగర్ కలెక్టర్ శీ యస్ . వెంకట రావు, వెంకటేశ్వర్లు SE(పబ్లిక్ హెల్త్), మహబుబ్ నగర్ మున్సిపల్ కమీషనర్ ప్రదీప్ కుమారు, పబ్లిక్ హెల్త్, EE విజయ భాస్కర్ రెడ్డి మరియు కన్సల్టేంట్ సుభాన్, ఆర్వీ అసోసియట్స్ ఇంజినీర్లు, సంబందిత శాఖల అధికారులు పాల్గోన్నారు.