బండి సంజయ్ పై హన్వాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

 బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేసిన మండల నాయకులు.......

ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్......

బండి సంజయ్ పై హన్వాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

 
ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హన్వాడ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు,  మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బండి సంజయ్ వైఖరిపై నిప్పులు చెరిగారు. హన్వాడ మండల కేంద్రంలో మహబూబ్ నగర్- తాండూర్ హైవేపై బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేసి రాస్తారోకో నిర్వహించారు. అనంతరం బండిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హన్వాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ ను అరెస్టు చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎంపీగా ఉన్న వ్యక్తి తన స్థాయిని దిగజారి ఎమ్మెల్సీ కవితపై వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటని హన్వాడ ఎంపీపీ బాలరాజు, బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కరుణాకర్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా మాట్లాడిన బండి సంజయ్ వైఖరిని ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. బండి సంజ‌య్ క్ష‌మాప‌ణ చెప్పే వ‌ర‌కు వ‌దిలిపెట్టం అని తేల్చిచెప్పారు. క‌విత‌కే కాదు.. మొత్తం మ‌హిళా లోకానికి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని వారు డిమాండ్ చేశారు.కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ కృష్ణ గౌడ్, యారోనిపల్లి సర్పంచ్ సుధ, మాజీ జెడ్పిటిసి నరేందర్, సింగిల్ విండో డైరెక్టర్లు శ్రీనివాసులు,  రవీందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రమణారెడ్డి,  జంబులయ్య, అనంతరెడ్డి, బసిరెడ్డి, డా. సత్యం,  మాధవులు, మహేష్ ,వెంకటయ్య, బాలకృష్ణయ్య, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.