CRPF పోలీసు బృందం కన్యాకుమారి నుండి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర
భారత స్వాతంత్ర్య 75 వ సంవత్సర వేడుకలను పురస్కరించుకుని, భారత స్వాతంత్ర్య పోరాట విశిష్టతను, నాటి సమర యోధుల త్యాగాలను తెలుపుతూ, యువతను చైతన్యం చేసే రీతిలో భారత్ కా అమృత్ మహోత్సవ్ పేరిట భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే CRPF పోలీసు బృందం కన్యాకుమారి నుండి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నది. ఇట్టి యాత్ర నేటి (07.09.2021) ఉదయం మహబూబ్ నగర్ జిల్లా లోకి ప్రవేశించగా, జిల్లా పోలీసు అధికారులు, యువత, ప్రజలు కలిసి వారికి ఘనంగా స్వాగతం పలికారు.ఇట్టి సైకిల్ యాత్రలోని సభ్యులు ఈ సాయంత్రం జడ్చర్లకు చేరుకున్నారు. రేపు బుధవారం ఉదయం 7.30 ని.లకు జడ్చర్ల పోలీసు శిక్షణా కేంద్రం నుండి తిరిగి యాత్ర ప్రారంభిస్తారు. ఉదయం 7.30 ని.లకు జడ్చర్ల DTC లో జరిగే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్.వెంకటరావు , జిల్లా ఎస్.పి. శ్రీ ఆర్.వెంకటేశ్వర్లు ఇతర అధికారులు, యువత, విద్యార్థులు పాల్గొంటారు.