సిపిఎస్ ను తక్షణమే రద్దు చేయాలి
సిపిఎస్ ను తక్షణమే రద్దు చేయాలి
- పీఆర్టీయు టీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అశ్విని చంద్రశేఖర్
ప్రభుత్వ ఉద్యోగ,ఉపాధ్యాయులకు ఆశని పాతంగా మారిన కాంట్రీ బ్యూటరీ పెన్షన్ స్కీం (సిపిఎస్)ను తక్షణమే రద్దు చేసి పాత పెన్షన్ విధానంను సత్వరమే అమలు చేయాలని పిఆర్టీయు టీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అశ్విని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1ని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి లోని జడ్పిహెచ్ ఎస్ , ప్రాథమిక పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీఆర్టీ యు టీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ 2004 సెప్టెంబర్ 1న దేశంలోనున్న ఉద్యోగ,ఉపాధ్యాయులందరికి సిపిఎస్ ను వర్తింప జేశారన్నారు. ఉద్యోగ,ఉపాధ్యాయుల భవిష్యత్తు కు విఘాతం కలిగించే సీపీస్ ను రద్దు చేయాలని ఆందోళనలు చేస్తున్నప్పటికీ పాలకులు పట్టించుకోక పోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానంను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ ను రద్దు చేసేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా ఉపాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, సిపిఎస్ నాయకుడు అహ్మద్, ఉన్నత పాఠశాల హెచ్ యం బి.విజయ్ కుమార్, ఉపాధ్యాయులు సల్వాచారి, శంకర్, బాసిద్, శ్రీనివాస్ గౌడ్, ఎస్.కల్పన, రజియా బేగం, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.