సీఎంఆర్ రైస్ నూటికి నూరుశాతం
జిల్లాలోని రైస్ మిల్లర్లు సీఎంఆర్ రైస్ నూటికి నూరుశాతం సకాలంలో డెలివరీ చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు కోరారు.
గురువారం ఆయన రెవెన్యూ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో సీఎంఆర్ పై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైస్ మిల్లర్లు వారికి నిర్దేశించిన సీఎంఆర్ రైస్ సకాలంలో డెలివరీ చేయాలని కోరారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామారావు,జిల్లా పౌరసరఫరాల అధికారి వనజాత తదితరులు పాల్గొన్నారు .