రక్త దాతలే నిజమైన ప్రాణ దాతలు - జిల్లా అదనపు కలెక్టర్

రక్త దాతలే   నిజమైన ప్రాణ దాతలు
- జిల్లా  అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తదానం చేసిన రక్త దాతలే నిజమైన ప్రాణ దాతలని 
జిల్లా అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో శనివారం జడ్చర్ల సమీపంలో ని ఎల్ అండ్ టి నిర్మాణ నైపుణ్య శిక్షణ కేంద్రంలో లో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. హరిత హారం కార్యక్రమంలో భాగంగా శిక్షణ కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. శిక్షణ కేంద్రంలో ని వివిధ విభాగాలను సందర్శించి నిర్వహిస్తున్న కార్యక్రమాలను పరిశీలించారు.  ఈ సందర్భంగా శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ దీపక్ శర్మ అధ్యక్షత న జరిగిన సమావేశంలో  అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా గొప్పది రక్త దానమని అన్నారు. ప్రతి ఒక్కరూ రక్త దానం చేసి ప్రాణా దాతలుగా నిలవాలని సూచించారు. ఆపడలో ఉన్న వారికి  రక్తదానం చేసిన వారు   ప్రాణ దాతలగా నిలుస్తారని అన్నారు.  రక్త దాన శిబిరాలను విరివిగా ఏర్పాటు చేసి తలసేమియా బాధితులను ఆదుకోవాలని సూచించారు. రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజు మాట్లాడుతూ

 బ్లడ్ బ్యాంకు లో రక్త నిల్వలు పెంచేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద గా ముందుకు వచ్చి రక్త దానం చేయాలని కోరారు. ప్రతి సంవత్సరం ఎల్ అండ్ టి సంస్థ నుంచి రక్తదాన శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.  కాగా  రక్త దానం చేసేందుకు ముందుకు వచ్చిన దాతలను అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్  అభినందిస్తూ సర్టిఫికెట్ లను ప్రదానం చేశారు. అంతకుముందు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ తేజస్ నందు లాల్ ను శాలువతో సన్మానించారు.   ఈ కార్యక్రమంలో జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త అశ్విని చంద్రశేఖర్,  ఎల్ అండ్ టి శిక్షణ సంస్థ అడ్మిన్ భవాని శంకర్, బిస్వాల్   తదితరులు పాల్గొన్నారు.