మహబూబ్ నగర్ జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు.

 మహబూబ్ నగర్ జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు. 

మొదటి రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో బతుకమ్మను ఆడి పాడిన  ఉద్యోగినులు, ప్రజా ప్రతినిధులు
 మొదటి రోజు వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర  ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ సతీమణి  వి.శారద,   జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సతీమణి రాజేశ్వరిలు
         బతుకమ్మ సంబరాల లో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ గారి సతీమణి,వి శారద, జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి తో పాటు  జిల్లా కలెక్టర్ సతీమణి రాజేశ్వరి, జిల్లా మహిళా అధికారులు, కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఉన్న కార్యాలయాల మహిళా ఉద్యోగినులు పెద్ద సంఖ్యలో హాజరై బతుకమ్మ సంబరాలను నిర్వహించారు.
       ఈ వేడుకలకు ప్రత్యేక అతిథి గా జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ,డి ఆర్ ఓ కే. స్వర్ణలత, ఆర్డీవో పద్మ శ్రీ, జిల్లా కలెక్టర్ కార్యాలయ ఏ ఓ ప్రేమ్ రాజ్, జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న అన్ని కార్యాలయాల మహిళా ఉద్యోగులు జిల్లా అధికారులు, మహిళా అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
      ముందుగా వీరు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో నుండి బతుకమ్మను ఊరేగింపుగా ఆవరణలోకి తీసుకువచ్చారు. అనంతరం బతుకమ్మకు పూజలు నిర్వహించి బతుకమ్మ ఆడి  పాడారు.