శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు

 తెలంగాణ సాంస్కృతిక ఆత్మగా నిలిచిన బతుకమ్మ పండుగను శ్రీ చైతన్య స్కూల్‌లో ఆనందంగా జరుపుకున్నారు. పూలతో అలంకరించిన బతుకమ్మలను విద్యార్థులు, ఉపాధ్యాయులు రంగురంగుల దుస్తుల్లో తీసుకువచ్చి పాటలు పాడుతూ, చిందులు వేస్తూ సంబరాలు జరిపారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ “బతుకమ్మ అనేది మహిళల ఆరాధన పండుగ మాత్రమే కాకుండా, తెలంగాణ సాంస్కృతిక సంపదకు ప్రతీక. ఐక్యత, ఆనందం, పర్యావరణానికి దగ్గరగా ఉండటం ఈ పండుగలో ప్రత్యేకత” అన్నారు. ఈ కార్యక్రమం లొ ప్రిన్సిపాల్ విద్యార్థులకు పండుగ యొక్క ప్రాముఖ్యతను వివరించారు.విద్యార్థులు బతుకమ్మ చుట్టూ నృత్యాలు చేస్తూ, జానపద గీతాలు ఆలపిస్తూ వాతావరణాన్ని పండుగ రంగులతో నింపారు. చివరగా, పాఠశాల ప్రాంగణంలో అందరూ కలిసి బతుకమ్మను ఆడుతూ సాంప్రదాయానికి గౌరవం తెలిపారు.ఈ కార్యక్రమం లొ ఏ జి ఎం భాస్కర్ రెడ్డి , కోఆర్డినేటర్ రఘు బాబు ,ప్రిన్సిపాల్ శ్రీధర్ , డీన్ మహేష్ సి బ్యాచ్ ఇంచార్జీ తాభసుం నౌషిన్ ప్రైమరీ ఇంచార్జీ మైత్రి , పి పి టిఇంచార్జీ సునీత , తదితరులు పాల్గొన్నారు.