బస్ సౌకర్యం కోసం పాదయాత్ర చేసిన బి జే పీ నాయకులు

 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం  బోయలపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ అధ్వర్యంలో బోయలపల్లి గ్రామం నుంచి కొల్లాపూర్ బస్సు డిపో వరకు పాదయాత్ర చేపట్టారు విద్యార్థులు. గ్రామస్తులు. గ్రామానికి బస్సులు లేక నరకయాతన అనుభవిస్తున్నామని ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాపురం గ్రామానికి నడిచి వెళ్లవలసి వస్తుందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని తెలిపారు. వెంటనే గ్రామానికి బస్సులు నడిపించాలని డిమాండ్ చేస్తూ గ్రామం నుంచి కొల్లాపూర్ బస్ డిపో వరకు పాదయాత్రగా చేరుకున్న వారు డిపో ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు.అనంతరం ఆర్టీసీ అధికారులు గ్రామానికి త్వరలోనే బస్ నడిపిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు