గుండె సంబంధ వ్యాధులపై గ్రామీణ వైద్య సేవకులకు అవగాహన సదస్సు
గుండె సంబంధ వ్యాధులపై గ్రామీణ వైద్య సేవకులకు అవగాహన సదస్సు..
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ సమావేశమందిరంలో గ్రామీణ వైద్య సేవ కొరకు హృదయ సంబంధ వ్యాధులపై ప్రాథమిక అవగాహన కల్పించే నిమిత్తం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డాక్టర్ భరత్ కుమార్ గౌడ్ కార్డియాలజిస్ట్ పాల్గొని ప్రత్యేక ఉపన్యాసం చేశారు.
కరోణ అనంతర పరిస్థితులు ప్రజలకు ఇబ్బందులను కలిగిస్తున్నాయని అందులో గుండె సంబంధ వ్యాధులు అదికంగా ఉన్నాయన్నారు. గుండె నొప్పి, ఛాతీ నొప్పి, గుండెదడ ,ఆయాసం, గుండెల్లో మంట కలగడం, మధుమేహం ,అధిక రక్తపోటు, వంటి వారు గమనించాల్సిన ప్రత్యేక లక్షణాలను గ్రామీణ వైద్యులకు వివరించి చెప్పారు, కాళ్ల వాపు ,గుండె సమస్యలు అన్ని వివరంగా తెలిపారు, చెమట పట్టడం కళ్లు తిరగడం వంటి లక్షణాలు గుండె నొప్పికి దారి తీసే విధానం గ్రామీణ వైద్య సేవకులకు వివరించారు .చిన్నపిల్లలో గుండె సమస్యలను ఎలా గమనించవచ్చు స్టెతస్కోప్ ఉపయోగించి లోపాని గుర్తించే విధానం తెలిపారు. ఇంకా ప్రథమ చికిత్స పై అవగాహన కల్పించి బాధితులకు భరోసా ఇస్తూ వేగంగా నిపుణులైన సంబంధిత వైద్యానికి సంప్రదించవలసినదిగా సూచించారు. అనంతరం డాక్టరు సుస్మిత ప్రస్తుతి మరియు శ్రీ వైద్యనిపుణులు మాట్లాడుతూ సంతానం కలగని వారికి తమ కేంద్రంలో అవగాహన కల్పించడంతో పాటు ప్రత్యేక చికిత్సలు అందించబడతాయి అని తెలిపారు స్త్రీల ఆరోగ్య సమస్యల పరిష్కారం కొరకు గర్భిణీ స్త్రీలు తమను సంప్రదించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమ అధ్యక్షులు ఏ కే శ్రావణ్ కుమార్ మాట్లాడుతు మంచి అవగాహన కల్పించినందుకు డాక్టర్ భరత్ కుమార్ గౌడ్ మరియు డాక్టర్ సుస్మిత లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సన్మానించారు .ఈ కార్యక్రమంలో లో అధిక సంఖ్యలో ఆర్.ఎం.పి పి.ఎం.పి పాల్గొని విజయవంతం చేశారు.