బీసీలపై దాడులు ఇంకెన్నాళ్లు

 బీసీలపై దాడులు ఇంకెన్నాళ్లు...

 

 దొరల అహంకారానికి బీసీలు బలి కావాల్సిందేనా...
 సంచార జాతులంటే అంత అలుసా...
 బీసీలపై దాడులు చేస్తే సహించేది లేదు...
 
బీసీలపై దాడులు చేస్తే సహించేది లేదని...సంచారాజాతులకు చెందిన ఇంటిని కూల్చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు.
   శనివారం మూసాపేట మండలంలోని జానంపేట గ్రామంలో  మన్నెమ్మ, నరసింహ దంపతులకు చెందిన కూల్చివేసిన ఇంటిని పరిశీలించారు.
 ఈ సందర్భంగా  కూల్చివేత ఘటనకు సంబంధించిన వివరాలు బాధితులను  అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రాచాల మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీసీలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, దేవరకద్ర నియోజకవర్గంలో మరీ ఎక్కువయ్యాయని, స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా బీసీలపై దాడులు మాత్రం ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.      
        దొరల అహంకారానికి పేద వర్గానికి చెందిన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తమ ఇళ్ల పక్కన సంచారాజాతులకు (ఎంబీసీలు) చెందిన వారు ఉండకూడదనే అక్కసుతో ఈనెల 28 వ తేదీన ఇదే జానంపేట గ్రామానికిన చెందిన బాబురావు దంపతులు దౌర్జన్యంగా  మనెమ్మ నరసింహ లకు చెందిన ఇంటిని కూల్చివేశారని, దీనికి సంబంధించిన వీడియో విజువల్స్ కూడా ఉన్నాయన్నారు.
సంచారజాతులకు జీవించే హక్కు లేదా...వారు మనుషులు కాదా అని, దౌర్జన్యంగా ఇంటిని కూల్చివేయడానికి ఎవరు అధికారమిచ్చారని మండిపడ్డారు.
        సంఘటన జరిగి రెండు రోజులవుతున్నా...అధికారులు ఇంతవరకు చర్యలు  తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 ఎంబీసీలపై దాడి చేసిన వారిని 24 గంటల్లో  అరెస్టు చేయాలని, లేనిపక్షంలో  తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. 
ఈ విషయమై  జాతీయ బీసీ కమిషన్ ను  కూడా ఆశ్రయిస్తామని, బాధితులకు న్యాయం జరిగే వరకు బీసీ సంక్షేమ సంఘం బాధితులకు అండగా ఉండడమే కాకుండా, బాధితుల పక్షాన పోరాటం చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంచారజాతుల సంఘం ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ చెన్నయ్య, బీసీ సంక్షేమ సంఘం నాయకులు శేఖర్ గౌడ్, రమేష్, శంకర్, దాసరి సంఘం గ్రామ అధ్యక్షులు తొడుగుల  నర్సింహా, వంశరాజ్ సంఘం అధ్యక్షుడు రామకృష్ణ, ఉపాధ్యక్షుడు సాయులు, రాము, నారాయణ, వెంకటేశ్వరమ్మ మన్యంకొండ నాగరాజు బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.