సాయుధ పోరాటం చారిత్రాత్మక ఘట్టం - డిసిసి అధ్యక్షుడు ఒబెదుల్ల కొత్వాల్
సాయుధ పోరాటం చారిత్రాత్మక ఘట్టం - డిసిసి అధ్యక్షుడు ఒబెదుల్ల కొత్వాల్...
తెలంగాణ సాయుధ పోరాటం దేశ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిందని డి సి సి అధ్యక్షుడు ఒబెడుల్ల కొత్వాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ విలీన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్వాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కొత్వాల్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో 4 వేల మంది ప్రత్యేక రాష్ట్ర సాధనలో మరో పదహారు వందల మంది అమరులయ్యారని అన్నారు. 63 ఏళ్ల సుదీర్ఘ పోరాటాన్ని గుర్తించే సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఔన్నత్యాన్ని చాటి చెప్పారని అన్నారు. అమరుల ఆశయాలను ముందుకు తీసుకెలుదామని అన్నారు. కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షులు రంగారావు, డి సి సి ఉపాధ్యక్షులు చంద్ర కుమార్ గౌడ్, టీ పీసీసీ కార్యదర్శులు ఎన్పీ వెంకటేష్, s.వినోద్ కుమార్, మీడియా సెల్ కన్వీనర్ సిజె బెనహర్, నాయకులు బెక్కరి అనిత లక్ష్మణ్ యాదవ్, సిరాజ్ ఖాద్రి, సాయిబాబా, కిషన్ జీ , రాములు యాదవ్, అజ్మత్ అలీ, చంద్రశేఖర్, సుభాష్, వెంకటలక్ష్మి, ఖాదర్, నాగరాజు, తాహెర్, అలీ, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.