మరో మారు మానవత్వం చాటుకున్న మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
మంగళ వారం అడ్డాకుల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనే నిమిత్తం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అడ్డాకుల వెళ్తుండగా 44వ జాతీయ రహదారిపై జానంపేట వద్ద అడ్డాకుల కు చెందిన వెంకటేష్ కుటుంబం ప్రయాణిస్తున్న కారు బోల్తా పడి ప్రమాదానికి గురికాగా మంత్రి తక్షణమే తన కాన్వాయ్ ని నిలిపి ఆ పక్కనే ఉన్న జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి క్షతగాత్రులను తరలించారు. తక్షణమే స్పందించి క్షతగాత్రులకు తక్షణ వైద్య సౌకర్యాలు కల్పించటం పట్ల మంత్రిని పలువురు ప్రశంసించారు.