మహబూబ్ నగర్ కి మరో మణిహారం ...మంత్రి డా.వీ.శ్రీనివాస్ గౌడ్ ప్రెస్
మహబూబ్ నగర్ కు మరో మణిహారం గా భూత్ పూర్ నుండి మహబూబ్ నగర్ మీదుగా హాన్వాడ వరకు మరో బైపాస్ ను మంజూరు చేసుకోవడం సంతోషం అని ఎక్ససైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఅర్ మొదటి ప్రాధాన్యత క్రమంలో ఈ రోడ్డు ను కేంద్ర మంత్రి గడ్కరీ తో మాట్లాడి 478.84కోట్లతో మంజూరు చేయించారు.దీనివల్ల టౌన్ లోని టీడీ గుట్ట ప్రాంతాలు అద్భుతంగా అభివృద్ధి చెందుతాయి అని అన్నారు.
గతంలో కొంత మంది ఈ రోడ్డు కాంట్రాక్టు తీసుకున్న వాళ్ళు బ్రిడ్జి నిర్మానాల్ను గాలికి వదిలేసిన ఇప్పుడు అంతకంటే అంతకన్నా అద్భుతమైన రోడ్డు మంజూరు చేయించుకోచాము అని
గత 12 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భూత్పూర్ మహబూబ్నగర్ బ్రిడ్జ్ ల నిర్మాణాలను సంవత్సరంలోపే పూర్తి చేస్తాం..
ఒక్క పని ఆపాలి అని చూస్తే మేము పది పనులు చేసి చూపిస్తాము...
కాలుష్యాన్ని అరికట్టే లిథియం షెల్ కంపెనీ తీసుకొస్తే దాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు...
అన్నం పెట్టే ప్రాజెక్టులు అడ్డుకోవాలని చూడొద్దు...
మహబూబ్ నగర్ పరిశ్రమలు తీసుకు రావడానికి అష్టకష్టాలు పడుతున్నాము..
ప్రతిపక్షాలు అభివృద్ధికి సహకరించాలి...
ఒకప్పుడు చిన్న చిన్న రోగాలకు చికిత్సల కోసం హైదరాబాద్ కు వెళ్లాల్సి వచ్చేది కానీ ఇప్పుడు క్యాన్సర్ లాంటి వ్యాధులకు కూడా ఇక్కడ చికిత్సలను అందుబాులోకి తెస్తున్నాం...
ఎన్నో వ్యయప్రయసలకు ఓర్చి ఈ రోడ్డు తీసుకొచ్చాము...
గతంలో పాలమూరు అభివృద్ధిని ఇప్పటి అభివృద్ధిని ప్రజలే బేరీజు వేసుకోవాలి...
నగర నలుమూలల్లో టూరిజం ,విద్య,పరిశ్రమలు నెలకొల్పుతాము...
బెర్లిన్ కు వెళ్ళిన సందర్భంగా అక్కడ ఉద్యోగాలు చేస్తున్న పాలమూరు బిడ్డలు ఇక్కడ జరుగుతున్న అభవృద్ధికి ఎంతగానో సంతోషిస్తున్నారు...
హైదరాబాద్ తరువాత రింగ్ రోడు కలిగిన పట్టణంగా పాలమూరు ను తీర్చి దిద్దుతాం...
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి అని మంత్రి శ్రీనివాస్ కూడా తెలిపారు.