పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి..జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్

పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి- జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్...

మహబూగర్ జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ జి.రవినాయక్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలియజేశారు.
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ విషయమై సోమవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు ,ఇంటర్మీడియట్ అధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్  జిల్లాలో  ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల పై మాట్లాడుతూ ఈ నెల 8న సంబంధిత శాఖల అధికారులతో జిల్లా స్థాయిలో సమన్వయ సమావేశాన్ని నిర్వహించామని, విద్యార్థులు పరీక్షలు రాసేందుకు మహబూబ్ నగర్ జిల్లాలో 32 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, అందులో 16 ప్రైవేట్ కళాశాలల్లో, 16 ప్రభుత్వ కళాశాలల్లో ఏర్పాటు చేశామని ,అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు, ఇతర ఏర్పాట్లను పూర్తి  చేశామని,ప్రైవేట్ కళాశాలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు   ఆయన వెల్లడించారు. జిల్లాలో మొత్తం 20 వేల 224 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని కలెక్టర్ వెల్లడించారు. ఇప్పటివరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని విద్యార్థులు నేరుగా ఇంటర్మీడియట్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే విధంగా అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు.అంతకు ముందు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలు విద్యార్థి జీవితానికి మలుపు లాంటివని అన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థుల పై   తీవ్ర ఒత్తిడి ఉంటుందని ,అందువల్ల విద్యార్థులకు ఏర్పాట్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, వేసవి దృష్ట్యా అన్ని కేంద్రాలలో తాగునీరు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని, ప్రశ్నాపత్రాలను తీసుకువెళ్లడం, తీసుకురావడంలో పూర్తి భద్రత ,కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో మెడికల్ కిట్, వైద్యులతో పాటు, విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి వచ్చే విధంగా   ఆర్ టి సి  బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ప్రతిపరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఫ్లైయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలని, విద్యుత్ సరఫరాలో  అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎక్కడైనా యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వనట్లయితే  విద్యార్థులకు సమస్య రాకుండా మందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకుగాను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని,  http://www.tsbie.cgg.gov.in     ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఆమె తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ విషయమే ప్రతి ఒక్కరు పూర్తి జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరారు.రాష్ట్ర విద్యా శాఖ సెక్రటరీ మరియు ఇంటర్ పరీక్షల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ  ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి ప్రారంభం అవుతున్న దృష్ట్యా ముందుగానే ఆయా పరీక్ష కేంద్రాలకు ఆర్టీసీ తగినన్ని బస్సులు నడపాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వైద్య ఆరోగ్యశాఖ తరఫున ఏఎన్ఎంతో పాటు, మెడికల్ కిట్ ఏర్పాటు చేయాలని ,పోలీసు, రెవెన్యూ అధికారులు పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల ఎక్కువ మంది గుమీ కూడకుండా చర్యలు తీసుకోవాలని, జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలని, సిసిటీవీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పరీక్షల నిమిత్తమై రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, 040-246010 లేదా 40- 2465527 నంబర్లతో కంట్రోల్ రూమ్  24 గంటలు పని చేసే విధంగా  ఉంటుందని, ఏప్రిల్ 4 వరకు ఇది పనిచేస్తుందని, స్టేట్ కంట్రోల్ రూమ్ లాగానే జిల్లా స్థాయిలో కూడా మినీ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. ఇదే కాక ఇటీవలే "టేలిమానస" అనే హెల్ప్ లైన్ ను కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందని "టెలి మానస" హెల్ప్ లైన్ నెంబర్ 14416 కు కూడా ఫోన్ చేసి తెలియజేయవచ్చని, ముఖ్యంగా డిగ్రీ, ఇంజనీరింగ్ ఇతర పరీక్షలు సంబంధించి కూడా  "టేలి మానసను" వినియోగించుకోవచ్చని ఆయన వెల్లడించారు.రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ తదితరులు మాట్లాడారు.అడిషనల్ ఎస్పి రాములు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు, డిపిఓ వెంకటేశ్వర్లు ,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ,పోస్టల్,విద్యుత్, ఇతర సంబంధిత శాఖల అధికారులు జిల్లా స్థాయి నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.