ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జన్మదినం మన తెలంగాణ ప్రజలకు పర్వదినం

తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు నిలిచి, రాష్ట్ర సిద్ధాంతకర్తగా కీర్తిగాంచిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్  జన్మదినం మన తెలంగాణ ప్రజలకు పర్వదినం అని జిల్లా ఎస్.పి. శ్రీ ఆర్.వెంకటేశ్వర్లు  అన్నారు.
పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఈ ఉదయం నిర్వహించిన ఆచార్య జయశంకర్  జన్మదిన వేడుకలలో ఎస్.పి.  మాట్లాడుతూ...
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు జరిగిన తొలి, మలి దశ ఉద్యమాలలో జయశంకర్  మేధస్సు ఉద్యమకారులకు దివిటీ అయింది.
రాష్ట్ర సాధనలో ముందుండి నడిపించిన మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారికి, జయశంకర్తో ఉన్న అనుబంధం, సమన్వయం అద్భుతమైనది.
ఒక కుగ్రామంలో జన్మించిన జయశంకర్ ఉన్నత విద్య అభ్యసించారు. తాను చదువుకున్న కళాశాలకే వైస్ ఛాన్సలర్ గా పని చేసిన అరుదైన ఘనత దక్కించుకున్నారు.
రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి పోరాటానికి ఊపిరి పోసిన మహనీయులు జయశంకర్ .
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని ఆయన చూడలేకపోయినా, ఆశీస్సులు తెలంగాణ ప్రజల వెన్నంటి ఉన్నాయి.
రాష్ట్ర సాధనలో త్యాగాలు చేసిన గొప్పవారి స్ఫూర్తితో శాంతిని కాపాడుకుంటూ, అభివృద్ధి వైపు పరుగులు పెట్టాల్సిన గురుతర బాధ్యత మనపై ఉందని ఎస్.పి.  పేర్కొన్నారు.
అంతకుముందు ఎస్.పి. శ్రీ ఆర్.వెంకటేశ్వర్లు, ఎస్.పి. అడ్మిన్ శ్రీ ఎన్. వెంకటేశ్వర్లు  ఆచార్య జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాల సమర్పించి గౌరవపూర్వక వందనం చేశారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ ఎస్.పి. శ్రీ లక్ష్మీనారాయణ, వనపర్తి డి.ఎస్.పి. శ్రీ షాకీర్ హుస్సేన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సురేష్, శ్రీనివాస్, అప్పలనాయుడు, ఇతర అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.