మున్సిపల్ పరిధిలో 6 కోట్ల రూపాయల తో సమీకృత కూరగాయల మరియు మాంసాహార మార్కెట్ కు శంకుస్థాపన చేసిన మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ ... గ్రీన్ ఛాలెంజ్ రూపకర్త సంతోష్ కుమార్ ..
రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గార్లు మహబూబ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ పరిధిలో 6 కోట్ల రూపాయల తో సమీకృత కూరగాయల మరియు మాంసాహార మార్కెట్ కు శంకుస్థాపనచేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ S. వెంకటరావు, SP వెంకటేశ్వర్లు, ఆదనపు కలెక్టర్ తేజాస్ నందులాల్ పవర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ. రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ KC నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, గ్రీన్ ఇండియా ప్రతినిధులు రాఘవ, వెంకటేష్, మాజీ మార్కెట్ చైర్మన్ రాజేశ్వర్, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.