585 మంది ప్రైవేటు పాఠశాల సిబ్బంది కి అందని ప్రభుత్వ సహాయం...

 585 మంది ప్రైవేటు పాఠశాల సిబ్బంది కి అందని ప్రభుత్వ సహాయం...
ప్రైవేటు పాఠశాలల బోధన బోధనేతర సిబ్బంది కి రాష్ట్ర ప్రభుత్వం అందించే 2 వేల రూపాయలు మరియు 25 కేజీల బియ్యము పంపిణీ 585 మంది సిబ్బందికి అందలేదు. ఈ విషయంపై జిల్లా ట్రస్మా అధ్యక్షులు మంగళవారం నాడు జిల్లా విద్యాధికారి ఉషారాణి కి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే  ఆర్థిక సహాయము మరియు బియ్యం పంపిణీ కొందరు ఉపాధ్యాయులకు మరియు బోధనేతర సిబ్బందికి మొదటి మరియు రెండవ విడతలో అందజేశారు. కానీ ఇంకా జిల్లాలోని 585 మంది లబ్ధి పొందని ప్రైవేట్ పాఠశాల సిబ్బంది కి 3 విడతలో అందించాలని జిల్లా విద్యాధికారి కి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ  చీఫ్ సెక్రెటరీ మరియు డిస్ట్రిక్ట్ స్కూల్ ఎడ్యుకేషన్, ఆర్ జె డి కి తెలియపరచి జిల్లా ప్రైవేటు పాఠశాల బోధన ,బోధనేతర సిబ్బందిని ఆదుకోవాలని డి ఈ ఓ కు విన్నవించారు. కొంత మంది ఉపాధ్యాయులకు ఇప్పటికీ కూడా 2 వేల రూపాయలు తమ  బ్యాంకు ఖాతాలో జమ కాలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రస్మా అధ్యక్షులు ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ చందర్ జి, అంజి రెడ్డి ,అబ్దుల్ సమీ తదితరులు పాల్గొన్నారు.