ఈనెల 22 నుండి 25 వరకు సూర్యపేట లో నిర్వహించబోయే 47వ జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలకు సాంకేతిక అధికారులు గా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన రేణి శ్రీనివాసులు మరియు ఉంద్యాల రాజ వర్ధన్ రెడ్డి పి.ఈ.టి, లు ఎంపికయ్యారు

తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 22 నుండి  25 వరకు సూర్యపేట లో నిర్వహించబోయే 47వ జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలకు సాంకేతిక అధికారులు  గా మహబూబ్నగర్  జిల్లాకు చెందిన రేణి శ్రీనివాసులు మరియు ఉంద్యాల రాజ వర్ధన్ రెడ్డి పి.ఈ.టి, లు ఎంపికయ్యారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బాలుర జట్టుకు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పి.వినోద్ కుమార్ ప్రాతినిథ్యం వహిస్తూ జాతీయ కబడ్డీ పోటీల్లో పాల్గొంటున్నారు. మహబూబ్నగర్ జిల్లా నుంచి ఇద్దరు సాంకేతిక అధికారులుగా మరియు ఒకరు తెలంగాణ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వస్తున్నందుకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బి. శాంతి కుమార్, కార్యదర్శి శ్రీ కే.బి శ్రీరాములు  అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు . వీరి ఎంపిక పట్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు శ్రీ ఎస్ విజయ్ కుమార్, రామచంద్రయ్య, బాలరాజు, కురుమూర్తి గౌడ్, పాపారాయుడు, టి. కే.రాములు అభినందించారు.