గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 20 మంది బాలికలకు అస్వస్థత

 గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 20 మంది బాలికలకు అస్వస్థత

మహబూబాబాద్:
 గురుకుల ఆదర్శ పాఠశాల వసతి గృహంలో చదువుతున్న 20 మంది బాలికలు అస్వస్థకు గురైనట్టు తెలిసింది. గురుకుల పాఠశాలలలో చదువుతున్న బాల బాలికలకు పౌష్టిక ఆహారం అందిస్తున్నామని, ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు వేదికలపై ప్రకటన చేసినప్పటికీ అది ఆచరణలో అమలు కాకపోవడంతో గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలబాలికలకు సరైన పౌష్టిక ఆహారం అందక కలుషిత ఆహారం తిని బాలబాలికలు ఆస్పత్రి పాలవుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నప్పటికీ అధికారులకు మంత్రులకు కనువిప్పు కలగడం లేదా?అని  ప్రజలు చర్చించుకుంటున్నారు. తాజాగా మహబూబాబాద్ బాలికల గురుకుల పాఠశాలలో గురువారము రోజున కలుషిత ఆహారం తిని 20 మంది బాలికలు విరోచనాలు వాంతులు చేసు కోవడంతో పాఠశాలలోనే వారికి చికిత్స అందిస్తున్నారు...