16వ వార్డు Trs అభ్యర్థి స్వాతి రాజేశ్ కు మద్దతుగా వార్డులో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రచారం ....

16వ వార్డు Trs అభ్యర్థి స్వాతి రాజేశ్ కు మద్దతుగా వార్డులో
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రచారం .... జడ్చర్ల  మున్సిపాలిటీ 16వ వార్డు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి స్వాతి రాజేష్ కు మద్దతుగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వార్డులోని ఇంటింటికి తిరిగి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి స్వాతికే ఓటు వేసి గెలిపించాలని కోరారు. పట్టణంలో అభివృద్ధి కోసం పాటుపడే టీఆర్ఎస్ నాయకులకు మాత్రమే ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ ఎన్నికలను టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదని, అందువల్ల ప్రజలు ఓట్లు టిఆర్ఎస్ అభ్యర్థులకే ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు.ఓటు ఆయుధం లాంటిది అందువల్ల ఓటర్లు తమకు సేవ చేసే వారికే ఓట్లు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే సూచించారు. జడ్చర్ల అభివృద్ధి గురించి ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏనాడు పట్టించుకోలేదని ఆయన అన్నారు. జరుగుతున్న అభివృద్ధి అంతా టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని ఆయన పేర్కొన్నారు. గతంలో పరిపాలించిన ఆంధ్ర వలస పార్టీల నాయకులు జడ్చర్ల అభివృద్ధిని విస్మరించారని అని విమర్శించారు. ఇప్పటికైనా అభివృద్ధి  పథకంలో పయనిస్తున్న పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు పట్టణ ప్రజలు తోడ్పాటును అందించాలని అని ఆయన కోరారు.  ప్రజా సేవ చేసేవారిని గుర్తించి సీట్లు కేటాయించడం జరిగిందని, స్వాతి రాజేష్ కు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. పట్టణంలో త్వరలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ చేయడం జరుగుతుందని, మహిళా సంఘాలకు అవసరమైనన్ని రుణాలు ఇవ్వడం జరుగుతుందని, నూతనంగా అందరికీ పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పథకాన్ని పట్టణ ప్రజలు అందుకునేందుకు టిఆర్ఎస్ అభ్యర్థులకే ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు. మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం టిఆర్ఎస్ పార్టీకే సాధ్యమని ఆయన అన్నారు. ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా చివరకు గెలుపు టిఆర్ఎస్ దే నని, టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి  దీమా వ్యక్తం చేశారు.