15 ఆగష్టు ఇంటింటా ఇన్నోవేటర్ ఆన్ లైన్ ఆవిష్కరణల ప్రదర్శన

  ఇన్నోవేషన్ మరియు సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలలో ఒకేసారి ఆయా జిల్లాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆన్ లైన్  లో ఆవిష్కరణల ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు  తెలిపారు. 

ఈ ప్రదర్శన జిల్లా స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉంటుందని, పౌరులు , ఆవిష్కర్తల మధ్య అనుసంధానం కావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని  నిర్వహించటం జరుగుతున్నదని తెలిపారు. కరోనా నేపధ్యంలో ఈ  సంవత్సరం ఈ ప్రదర్శన ఆన్లైన్ లో నిర్వహించనున్నారని, జిల్లా ప్రజలు ఈ ప్రదర్శనను సోషల్ మీడియా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చని అన్నారు.