ముందస్తు కాంగ్రెస్ నాయకుల అరెస్టు

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా చలో రాజ్ భవన్ కు టిపిసీసీ పిలుపు:  ముందస్తు కాంగ్రెస్ నాయకుల అరెస్టు
 
పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించాలని డిమాండ్ తో టిపిసీసీ అధ్యక్షులు ఏనుముల రేవంత్ రెడ్డి  అధ్యక్షతన మరియు నారాయణపేట జిల్లా అధ్యక్షులు కుంభం.శివకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు  శుక్రవారం తలపెట్టిన రాజ్ భవన్ ముట్టడికి  పిలుపు నివ్వడంతో కాంగ్రెస్ నాయకులు  మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బండి.వేణుగోపాల్, మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్ ఎండి.సలీం, మైనారిటీ సెల్ అధ్యక్షుడు మహిముద్ ఖురేషి,రేవంత్ సైన్యం జిల్లా అధ్యక్షులు యూసుఫ్ తాజ్, యువజన కాంగ్రెస్ నాయకులు బండి.ఆనంద్, కళ్యాణ్ కుమార్,లను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి నారాయణపేటపోలీసు స్టేషను కు తరలించడం జరిగింది.
ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బండి.వేణుగోపాల్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుకొంటు పోతుందన్నారు. ఈ ఏడాది నుండి ఇప్పటివరకు సుమారు 69 సార్లు ధరలు పెంచుతూ సామాన్యులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.వాస్తవంగా పెట్రోల్ ధర 40 రూ.లు ఉంటే కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం 33శాతం రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం 32 శాతం పన్నులు విధిస్తూ ఇప్పటివరకు సుమారు 25 లక్షల కోట్ల రూపాయలను ప్రజల నుండి దోచుకొన్నారని ఆరోపించారు.ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రొల్ పై వ్యాట్ ను రద్దు చేస్తూ లీటరుకు 12 రూ.లు తగ్గించిందన్నారు.నిత్యావసర ధరలతో పాటు, గ్యాస్, పెట్రో ధరల పెంపును నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు శుక్రవారం రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో సామాన్యుని పై పెరుగుతున్న భారానికి నిరసనగా చలో రాజ్ భవన్ కార్యక్రమానికి పిలుపు నిస్తే కాంగ్రెస్ నాయకులను అరెస్టు  చేయడం అప్రజాస్వామికమని అన్నారు.కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్ట్ లను నిరసిస్తూ త్వరలో పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తామన్నారు.