ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లో రక్తదాన శిభిరం
ఈరోజు లియో క్లబ్ ఆఫ్ మహబూబ్ నగర్ జేమ్స్ ఆధ్వర్యములో తెలంగాణ చౌరస్తా లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లో రక్తదాన శిభిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిభిరాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి చైర్మెన్ లయన్ డాక్టర్ ఎ.నటరాజు ప్రారంబించారు. ఈ రక్తదాన శిబిరం లో 25 యూనిట్ల రక్తం సేకరించడం జరిగింది. ఈ సందర్భంగా లయన్ డాక్టర్ ఎ.నటరాజు గారు లియో క్లబ్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమం లో క్లబ్ అధ్యక్షుడు లియో రేవన్ సంజయ్ గాజుల, కార్యదర్శి లియో ఫణీంద్ర కుందూరు, కోశాధికారి లియో భరత్ కుమార్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ మహబూబ్ నగర్ సభ్యులు లయన్ మృత్యుంజయ గాజుల, లయన్ రాములు మండ్ల, కోశాధికారి లయన్ ప్రసాద్ కుందూరు, ఉపాధ్యక్షులు లయన్ శ్రీహరి కుందూరు తదితరులు పాల్గొన్నారు.