సైబర్ నేరగాళ్ల తో తస్మాత్ జాగ్రత్త జిల్లా ఎస్పీ. చేతన ఐపిఎస్
సైబర్ నేరగాళ్ల తో తస్మాత్ జాగ్రత్త జిల్లా ఎస్పీ. చేతన ఐపిఎస్
ప్రజలు సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలకు గురికావద్దు
జిల్లా ఎస్పీ. డాక్టర్ చేతన ఐపిఎస్ గారు ఈ సందర్భంగా ఒక ప్రకటనలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రతి రోజు జరుగుతున్న ఓటీపీ ఫ్రాడ్, సోషల్ మీడియా ప్రభావం, ఎనీ డెస్క్, OLX ఫ్రాడ్, ఫిషింగ్ టైప్ ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్ వంటి మోసాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. ఎక్కువగా అంతర్రాష్ట్ర గ్యాంగులు సోషల్ మీడియాలో ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ ఫ్రాడ్స్ అమాయకులను నమ్మించి బ్యాంకు ఓటిలపిల తస్కరణ ద్వారా వారి బ్యాంకు ఖాతాలోని సొమ్మును దోచేస్తున్నారు. ఆన్ లైన్లో ఏమరపాటుగా ఉన్నారో అంతే సంగతులు అంటున్నారు మీ బ్యాంక్ అకౌంట్ లోని డబ్బుతో పాటు మనశ్శాంతి కరువవుతుంది. సైబర్ నేరాల కట్టడికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ. గారు తెలిపారు. Prevention is better than cure అనే నానుడి ఉంది. సమస్య రాకముందే జాగ్రత్త పడడం ఉత్తమం.
ఆన్ లైన్ మోసాలు ...
ఈ మధ్యకాలంలో ఫేస్ బుక్ లను హ్యాక్ చేసి ఫ్రెండ్ లాగ డబ్బులు పంపించమని అడిగి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు కావున ప్రజలు ఎవరిని నమ్మరాదని తెలిపారు. మరియు మీ క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతున్నామనీ, లేదా మీ బ్యాంక్ ఎకౌంట్ సెక్యూరిటీ వెరిఫై చేస్తున్నామని ఈ లింక్ క్లిక్ చేసి వెంటనే మీ ఎకౌంట్ నిర్ధారించుకోమనీ ఇలా వచ్చే మెసేజ్లకు వెనకా ముందు ఆలోచించకుండా చాలామంది స్పందిస్తుంటారు. లింకు క్లిక్ చేసిన వెంటనే ప్రత్యక్షమయ్యే వెబ్‌సైట్ మీ బ్యాంక్‌కి సంబంధించిన వెబ్ సైటు మాదిరిగానే ఉంటుంది. మీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వివరాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌లు టైప్ చేయడం ఆలస్యం తెర మీద ఓ ఎర్రర్ మెసేజ్ వచ్చి అంతటితో నిలిచిపోతుంది. పైకి మనకు కనిపించేది అదే, కానీ మనకు తెలియకుండానే మనం ఎంటర్ చేసిన వివరాలు మొత్తం హ్యాకర్‌కి చేర్చబడతాయి. దీంతో కొన్ని రోజుల తర్వాత మన అకౌంట్ లో బ్యాలెన్స్, క్రెడిట్ కార్డు లిమిట్ ఖాళీ అయిపోతుంది. అందుకే మెయిల్‌్మకు వచ్చే అన్ని లింకులను గుడ్డిగా క్లిక్ చేయకూడదు.
సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..