వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్షి జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు

  జిల్లా ఆసుపత్రి తో పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో  అవుట్ పేషెంట్ల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్  ఎస్.వెంకట రావు అన్నారు.

         శనివారం ఆయన కలెక్టర్ కార్యాలయం నుండి వేబినార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్షించారు.
           కోవిడ్ ను సమీక్షిస్తూ కోవిడ్ పరీక్షలకు ఎవరిని హైదరాబాద్ పంపించాల్సిన అవసరం లేదని, అన్ని రకాల పరీక్షలు ఇక్కడే నిర్వహించాలని ఆదేశించారు. కోవిడ్  రోగులకు  ఫ్రూట్స్ తో పాటు నాణ్యమైన భోజనం అందించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదని అన్నారు.  ముఖ్యంగా పేషెంట్లకు ఇచ్చే భోజనాన్ని  ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా ప్రతిరోజు  పరిశీలించిన తర్వాతే రోగులకు పంపించాలని సూచించారు.  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య అధికారులు వారి పరిధిలో  ప్రతి రోజు తప్పనిసరిగా 50 శాతం కోవిడ్ రోగులను చూడాల్సిన అవసరం ఉందని అన్నారు.  ఆదివారం కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తెరిచి ఉంచాలని ఆదేశించారు .మండల ప్రత్యేక అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి మందులు ఇస్తున్నది లేనిది సరిగా పర్యవేక్షణ చేస్తున్నది లేనిది చూడాలని అన్నారు.
            ఈ నెల 5 నుండి 12 వరకు నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నివారణ వారోత్సవాల్లో భాగంగా అన్ని శాఖల అధికారులు వైద్య ఆరోగ్య శాఖకు సమన్వయంతో సహకారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు .ఇమ్యునైజేషన్ కు సంధించి వైద్యాధికారులు ప్రతి నెల 5వ తేదీలోగా రిపోర్టులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కి పంపించాలని ఇకపై ప్రతి నెల ఆరవ తేదీన వైద్య ఆరోగ్య శాఖ కార్యకలాపాలపై తాను ప్రత్యేకంగా సమీక్షిస్థానన్నారు . గ్రామాలు మున్సిపల్ పట్టణాలలో నిరంతరం దోమల నివారణ చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు .ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా ఆస్పత్రుల్లో కూడా ఆవుట్ పేషెంట్ల  సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కెసిఆర్ కిట్ ను సమీక్షిస్తూ   గర్భిణీ స్త్రీలు ప్రసవ  తేదీలను దృష్టిలో ఉంచుకొని ఎంపీహెచ్ ఏ లు,  ఎం పి హెచ్ ఓ లు అనుసరిస్తూ గర్భిణీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనిచేయాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తోపాటు ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రతివారం నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేయాలని అన్నారు. ఆరోగ్యశాఖ కార్యకలాపాలపై కఠినంగా సమీక్షించాలని అన్నారు.
              అదనపు  కలెక్టర్లు సీతారామరావు, తేజస్ నందలాల్ పవర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కృష్ణ  తోపాటు ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, ఎం పి హెచ్ ఎస్, ఎం పి హెచ్ ఈ లు, ఏ ఎన్ ఎం, తాసిల్దార్ లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు ఈ  వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు