రక్తదానం మహాదానం ... మహబూబ్నగర్ డీఎస్పీ శ్రీధర్
రక్తదానం మహాదానం అని అన్నారు మహబూబ్నగర్ డీఎస్పీ శ్రీధర్. ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడం అంటే వారికి పునర్జన్మ ఇవ్వడం లాంటిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మహబూబ్నగర్ శాఖ ఆధ్వర్యంలో ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ వారి సహకారంతో మహబూబ్ నగర్ లోని ఇండియన్ రెడ్ క్రాస్ భవనం నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ లయన్ డాక్టర్ నటరాజ్ మాట్లాడుతూ రక్త దానం పై యువత అపోహలు వీడాలని పిలుపునిచ్చారు. జాతీయ రహదారి కి అతి సమీపంలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లా లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ... క్షతగాత్రులకు రక్తం ఎంతో అవసరం పడుతుందని ఆయన గుర్తు చేశారు. రక్త దానం ఎన్ని సార్లు తీసిన ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని పైగా ఆరోగ్యం మరింత మెరుగు పడుతుందని ఆయన సూచించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారిని నటరాజు మరియు డీఎస్పీ శ్రీధర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ముద్ర సంస్థ రీజినల్ మేనేజర్ రఘురాం.. మేనేజర్ గోవర్ధన్.. ఇన్చార్జి శంకర్ లు పాల్గొన్నారు