మండల ఎంఈఓ , ఎం పి ఓ పై కలెక్టర్ ఆగ్రహం
అభివృద్ధి పనుల పై అధికారులతో సమీక్ష సమావేశం ........ మండల ఎంఈఓ , ఎం పి ఓ పై కలెక్టర్ ఆగ్రహం....
కోయిలకొండ మేజర్ న్యూస్: మండలం లో విధులు నిర్వహిస్తున్న అధికారులకు మండల కేంద్రంలో ఉన్న తాసిల్దార్ కార్యాలయంలో అభివృద్ధి పనుల పై సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ వెంకట్రావు నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ పలు అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. అదేవిధంగా కోయిలకొండ మండలం లో ప్రభుత్వ పాఠశాలలో ఆ న్ లైన్ క్లాసులు ఎందుకు నిర్వర్తించడం లేదని ఎంఈఓ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల ద్వారా ఆ న్ లైన్ క్లాసులు వెంటనే నిర్వహించ కుంటే ఎంఈఓ ను సస్పెండ్ చేస్తానని కలెక్టర్ హెచ్చరించారు. అదేవిధంగా కోయిల్ కొండ గ్రామంలో వర్షపు నీరు రోడ్డుపైనే నిలువ ఉన్నందుకు ఎం పి ఓ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో కరోనా వ్యాధి ఎంత మందికి సోకింది, కోలుకుని ఆరోగ్యంగా ఉన్నా వారి వివరాలను వెంటనే తెలియ చేయాలని వైద్య అధికారులను కోరారు. అదేవిధంగా సేరి వెంకటాపూర్ గ్రామంలో అనంతయ్య అనే కరోనా సోకిన వ్యక్తి తో కలెక్టర్ ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మండలంలో స్మశాన వాటిక లను, రైతు వేదికలను వేగవంతంగా పనులు పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఆర్ పాండు, ఎంపీడీవో రాఘవ, మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.