భూసేకరణపై వీడియో కాన్ఫరెన్స్...జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు
జిల్లాలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు ,జాతీయ రహదారి ,రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు ఆదేశించారు.
మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి భూసేకరణపై ఆయా ప్రాజెక్టుల ఇంజనీరింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, సర్వే ల్యాండ్ రికార్డుల అధికారులు, తాసిల్దార్ లతో వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
జాతీయ రహదారి భూసేకరణకు సంబంధించి అప్పనపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద ,అలాగే ఇతర ప్రాంతాలలో అలైన్మెంట్ పనులకు త్వరితగతిన క్లియరెన్సు ఇవ్వాలని జాతీయ రహదారి ఇంజనీరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రతాపరెడ్డి తో పాటు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై రెవిన్యూ, జాతీయ రహదారి అధికారులు ఒకసారి సమావేశమై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని చెప్పారు .
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూసేకరణను కలెక్టర్ సమీక్షిస్తూ ఉదండాపూర్,కర్వేన, కోయిల్ సాగర్ తదితర రిజర్వాయర్ ల పెండింగ్ భూసేకరణ, బిల్లుల చెల్లింపు వంటి అంశాలను సమీక్షించారు. భూసేకరణకు సంబంధించి డి ఎన్, డి డి పత్రికలలో జాప్యం లేకుండా ప్రచురించేందుకు చర్యలు చేపట్టాలని, ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అదేవిధంగా ఉదండాపూర్ రిజర్వాయర్,కర్వేనకు సంబంధించిన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని అన్నారు .
రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి రైల్వే డిప్యూటీ ఇంజనీర్ రవి కుమార్ తో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులు దాదాపుగా పూర్తయ్యాయని, రాజాపూర్ కు సంబంధించిన భూసేకరణ ను వెంటనే క్లియర్ చేయాలని రాజాపూర్ తాసిల్దార్ ను ఆదేశించారు. భూ సేకరణకు సంబంధించిన భూమి పొజిషన్ అప్పగించే విషయంపై కూడా భూత్పూరు, బాలానగర్ తాసిల్దార్ లతో కలెక్టర్ సమీక్షించారు.
ఈ వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు సీతారామారావు, తేజస్ నందలాల్ పవర్,డి ఆర్ ఓ స్వర్ణలత,సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఎడి శ్యామ్ సుందర్, ఇతర అధికారులు హాజరయ్యారు .