డెంగ్యూపై సమర శంఖం పూరిద్దాం

 ప్రజలను అనారోగ్యాల బారిన పడేసే డెంగ్యూపై సమరశంఖం పూరిద్దామని మహబూబ్‌నగర్  జిల్లా స్పెషల్ కలెక్టర్  తేజాస్ నందులాల్ పరివార్ పిలుపునిచ్చారు .గురువారం మహబూబ్‌నగర్  జిల్లా కేంద్రంలోని 6వ వార్డు పరిధిలోని శ్రీనివాసకాలనీ, ఉర గుట్ట ,పోచమ్మ గుడి ప్రాంతాలలో ఆయన మున్సిపల్ కమిషనర్ వడ్డె సురేందర్ మరియు వార్డు కౌన్సిలర్  పటేల్ ప్రవీణ్ కుమార్ తొ కలిసి పర్యటించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రజలు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని , మురుగు నీటిని తమ పరిసరాలలొ లేకుండా చూసుకోవాలని సూచించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని నిల్వ ఉంచుకోరాదని అన్నారు .

 
- పటిష్ట డ్రైనేజీని వ్యవస్థ ఏర్పాటయ్యేలా చూడండి : కౌన్సిలర్ పటేల్ ప్రవీణ్  
 
వర్షాకాలం వచ్చిందంటే చాలు వార్డు పరిధిలోని పలు నాలాలు పొంగి పొర్లుతున్నాయని ,సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక నీళ్లన్ని రోడ్లుపైకి వచ్చి ఇళ్లమధ్యలో కి వచ్చి దుర్గంధం  వెదజల్లుతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు .పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ నిర్మించుకునేందుకు సరిపడా నిధులు మంజూరు చేయించాలని  కలెక్టర్ కు విన్నవించినట్టు ఆయన తెలిపారు.అలాగే పలు ప్రాంతాల్లో  సిసి రోడ్లు లేని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పేర్కొంటున్నారని కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు .