జిల్లా కలెక్టర్ వెంకట్ రావు ఆకస్మిక తనిఖీ

బాలానగర్ : బాలానగర్ మండలం పెద్దాయపల్లి,కేతిరెడ్డిపల్లి గ్రామాల్లో నిర్మించబడుతున్న రైతు వేదిక భవనాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ వెంకట్ రావు  శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆయా  గ్రామాలలోని స్మశానవాటిక, డంపింగ్ యార్డ్ పనులను కూడా పరిశీలన చేశారు.పనులలో పురోగతి కనిపించాలని,  సాధ్యమైనంతవరకు నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని కలెక్టర్ అధికారులను,  ప్రజాప్రతినిధులను ఆదేశించారు.