అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
మహబూబ్నగర్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు ,సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు .
గురువారం ఆయన మహబూబ్నగర్ మున్సిపాలిటి పరిధిలో అంబేద్కర్ నగర్ 10 లక్షల రూపాయల వ్యయంతో మోటార్ లైన్ ఏరియా లో 10 లక్షల రూపాయల వ్యయంతో, జిల్లా జైలు పక్కన 10 లక్షల రూపాయల వ్యయంతో మరియు పాతపాలమూరులో 24 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీలకు మరియు కాంపౌండ్ వాల్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈరోజు పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగినదని, పేద ప్రజలకు అన్ని రకాలుగా ఆదుకుంటామని, పేద ప్రజలకు అన్యాయం జరగకుండా వారికి అన్ని ప్రయోజనాలు కల్పిస్తామని, మహబూబ్ నగర్ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకుని వెళ్తామని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమములో మున్సిపల్ చైర్మన్ కెసి నర్సిములు, వివిధ వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ సురేందర్,అర్బన్ తహశీల్దార్ పార్థసారథి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.