అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన,
మహబూబ్నగర్ పట్టణంలోని అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన, ప్రభుత్వ పాఠశాలలో విజ్ఞాన శాస్త్ర ప్రయోగ శాలలకు (సైన్స్ ల్యాబ్) ప్రారంభోత్సవం చేసిన ఎక్స్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్.
గురువారం మహబూబ్ నగర్ పట్టణంలోని క్రిస్టియన్ పల్లి లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
అనంతరం మహబూబ్ నగర్ పట్టణంలోని క్రిస్టియన్ పల్లి లోనీ ఎం.వి.యస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఒక కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ఆరేండ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని, ఎంవిఎస్ కళాశాలలో గతంలో అదనపు తరగతి గదులను నిర్మించడం జరిగిందని, కళాశాల ప్రాంగణంలో వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేశామని, ఈ కళాశాలలో చదివే సమయంలో ఇన్ని వసతులు ఉండేవి కాదని, ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని మంత్రి సూచించారు.
తదనంతరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, వన్ టౌన్ చౌరస్తా పాఠశాల వద్ద తొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సైన్స్ ల్యాబ్ ను మంత్రి ప్రారంభించారు.
అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తిరుమల దేవుని గుట్ట వద్ద ఉన్న పాఠశాలలో తొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సైన్స్ ల్యాబ్ ను మంత్రి ప్రారంభించిన అనంతరం గతంలో శంకుస్థాపన చేసిన అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని మంత్రి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేష్, డీఈఓ ఉషారాణి,కౌన్సిలర్లు రాణి, ఆనంద్ కుమార్ గౌడ్, రామ్ లక్ష్మణ్, కో అప్షన్ మెంబర్ వరలక్ష్మీ, అనంత్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.