హేమసముద్రం చెరువులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేపపిల్లలను వదిలారు
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం ఇంబ్రహిం బాద్ గ్రామం లోని హేమసముద్రం చెరువులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేపపిల్లలను వదిలారు
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బడుగు బలహీనవర్గాల సంక్షేమం కోసం ఎన్నో రకాల పథకాలను తీసుకురావడం జరిగిందని 1000 కి పైగా గురుకులాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు అదేవిధంగా యాదవులకు గొర్రెలు ముదిరాజ్ లకు ప్రత్యేకంగా సబ్సిడీ పైన మోపెడ్ లు ద్విచక్ర వాహనాలు ఇవ్వడం జరిగిందని ఉచితంగా చేపపిల్లలను ఇవ్వడం జరిగిందని మిషన్ కాకతీయ ద్వారా ఇప్పటికే చెరువులను పూడిక తీసుకోవడం జరిగిందని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే హన్వా డ మండలం పాడి పంటలతో షష్యశామలం అవుతుందని అన్నారు.