హరిత హోటల్ ను ఆకస్మికంగా తనిఖీ ....మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్

 మెదక్ జిల్లా గజ్వేల్ వద్ద గల హరిత హోటల్ ను మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారు ఆకస్మికంగా పరిశీలించారు. కరోనా సమయంలో హరిత హోటల్ లో అనుసరిస్తున్న జాగ్రత్తలను మంత్రి స్వయంగా పర్యటించి, వంట గది, డైనింగ్ మరియు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. హోటల్ ను హైజనిక్ పద్దతిలో అనుసరించడం వలన హోటల్ సిబ్బందిని మంత్రి అభినందించారు. ఇదే విధంగా పరిశుభ్రంగా, హైజనిక్ పద్దతిని పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రాజు గారు, టూరిజం ఎండి మనోహర్ గారు ఉన్నారు.