సురక్షితంగా బయటపడ్డ కవల ఆడపిల్లలు...

 ఈ నెల 4.9.2020 తేదీన గండీడ్ మండలం దేశాయపల్లి గ్రామానికి చెందిన కేశవులు, కృష్ణవేణి దంపతులకు జన్మించిన కవల ఆడపిల్లలు తండ్రి అయిన కేశవులు చేతిలో హత్యా యత్నానికి గురైన  ఆడశిశువులు ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డ విషయం తెలుసుకుని   రవి చిల్డ్రన్ హాస్పిటల్ను సందర్శించి శిశువులను పరామర్శించిన రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్. 

మంగళవారం రవి చిల్ర్డన్ హస్పిటల్ నందు పిల్లలను పరామర్శించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రమాదానికి గురైన చిన్న పిల్లలను తరలించి 22 రోజుల నుండి చికిత్స అందించి వారిని ప్రమాదం నుంచి బయటకు తీసుకురావడానికి రవి చిన్న పిల్లల ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శేఖర్, ఆసుపత్రి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించి  చిన్నారులను ప్రాణాపాయం నుండి కాపాడి  తల్లికి అప్పచెప్పడం చాలా సంతోషంగా ఉందని మంత్రి అన్నారు.  ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అమలు చేయాలని, మారుతున్న సమాజంలో పురుషులతో పాటు మహిళలు సమానంగా పనిచేస్తున్నారని, ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరం అన్నారు. చిన్నారులను ప్రాణాపాయ స్థితినుండి బయటకు తీసుకు వచ్చేందుకు కృషి చేసిన డాక్టర్ శేఖర్ ను మంత్రి సన్మానించారు.