సీసీ రోడ్డు పనులకు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్.
దాదాపు తొమ్మిది లక్షలతో ఆరవ వార్డు లో చేపట్టే సీసీ రోడ్డు పనులకు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్.సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం వార్డులో పర్యటించి పరిసరాలను పరిశీలించిన మంత్రి, వార్డులో చేపట్టవలసిన అభివృద్ధి పనుల గురించి మున్సిపల్ కమీషనర్ మరియు సిబ్బందితో చర్చించారు. వార్డులో ఉన్న సమస్యలను స్థానికులు మంత్రికి తెలిపారు. అందుకు స్పందించిన మంత్రి వార్డులో సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింలు, డీ సి సి బి వైస్ చైర్మన్ వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్ సురేందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.