సీనియర్ సిటిజన్స్ ప్రయోజనార్థం
సీనియర్ సిటిజన్స్ ప్రయోజనార్థం తీసుకువచ్చిన సీనియర్ సిటిజన్స్ చటాన్ని నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకట రావు తెలిపారు.
ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుండి నిర్వహించిన వేబినార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీనియర్ సిటిజన్లు ,అధికారులతో మాట్లాడారు.
ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం సందర్బంగా ఆయన జిల్లాలోని సీనియర్ సిటిజన్లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎంతోమంది విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, మేధావులు, ఇతరులు సీనియర్ సిటిజన్లు జిల్లా లో చాలా మంది ఉన్నారని, వీరందరూ వివిధ సమయాలలో జిల్లా యంత్రాంగానికి సహకారం అందిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. సీనియర్ సిటిజన్లకు జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని ఆయన వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి ఈ వెబినార్ కు హాజరైన జిల్లా ఎస్పీ రేమో రాజేశ్వరి మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ లను సముచితంగా గౌరవిస్తామని,వారికి సేవలందించేందుకు పోలీస్ శాఖ తరఫున ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. సీనియర్ సిటిజన్లు అవసరమైనప్పుడు తమ సహకారం తీసుకోవాలని, ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని మరిచిపోవద్దని, అవసరమైతే డయల్ 100 కు ఫోన్ చేయాలని కోరారు.
ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్లు విజయ్ కుమార్ ,నాగేంద్ర స్వామి, గంగాధర్ తదితరులు మాట్లాడుతూ జిల్లాలో చాలామంది విశ్రాంత ఉద్యోగులు ఉన్నారని, జిల్లా యంత్రాంగానికి అవసరమైన సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ముఖ్యంగా క్వాలిటీ ఎడ్యుకేషన్, అభివృద్ధిలో భాగస్వాములు అవుతామాని ,తమ సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా సంక్షేమ అధికారి రాజేశ్వరి, జిల్లా పరిషత్ సి ఈ ఓ యాదయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కృష్ణ తదితరులు హాజరయ్యారు.